నీటి యాజమాన్యం :

చిన్న మొక్కలకు 6 నెలల వరకు ౩ రోజులకోకాసారి నీరు పెటాలి. కాపు వచ్చిన చెట్లకు పూత, పిందె దశల్లో నీటి ఎద్దటి రాకుండా నీరు పెట్టాలి. మామిడి తోటలకు కాయ పెరిగే దశలో కనీసం రెండుసార్లు అంటే పిందె ఏర్పడిన తరువత 25 -30 రోజులకు ఒకసారి, నెలరోజుల తరువాత మరోసారి నీరు కట్టి కాయలు కోయటానికి 25 – 30 రోజుల ముందు నీరు పెట్టడం ఆపివేయాలి. మామిడి కోత తరువాత వెంటనే ఒకసారి నిరుకట్టాలి. వేసవిలో నీటి ఎద్దటి ఏర్పడితే వేరుకుళ్ళు తెగులు ఉదృతి చెంది తోటంతా దెబ్బ తింటుంది.